హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధర్మవరం ఆర్టీసీ డిపోలో డ్రైవర్ ఉద్యోగాలు

సత్యసాయి: ధర్మవరం ఆర్టీసీ డిపోలో ఆన్‌కాల్, డైలీ వేజెస్ ప్రాతిపదికన పనిచేసేందుకు డ్రైవర్ల ఖాళీలు ఉన్నట్లు డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు అనుభవం ఉన్న అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తిగలవారు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో డిపో మేనేజర్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.