హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాడిపత్రి మున్సిపాలిటీకి అరుదైన పురస్కారం

ATP: అంతర్జాతీయ పర్యటక దినోత్సవం సందర్భంగా తాడిపత్రి మున్సిపాలిటీకి అర్బన్ కేటగిరిలో బెస్ట్ సివిక్ మేనేజ్మెంట్ ఆఫ్ టూరిజం డెస్టినేషన్ అవార్డు లభించింది. రాష్ట్రంలోనే ఏకైక పురపాలక సంఘంగా ఇది ఎంపికైంది. రాజమండ్రిలో జరిగిన కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ అవార్డు అందుకున్నారు.