హైదరాబాద్: 28°C
క్రీడలు

WAPL విజేతగా రాయలసీమ జెన్ స్టార్స్

AP: ఉమెన్ ఏపీఎల్ టోర్నీ విజేతగా రాయలసీమ జెన్ స్టార్స్ జట్టు నిలిచింది. ఫైనల్ పోరులో గోదావరి గోల్డెన్ ఈగల్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గోదావరి జట్టు నిర్ణీత ఓవర్లలో 96/9 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన రాయలసీమ జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టోర్నీ విజేతగా నిలిచిన జెన్ స్టార్స్‌కు రూ.15 లక్షల ప్రైజ్ మనీ దక్కింది.