హైదరాబాద్: 28°C
క్రీడలు

కోహ్లీ విధ్వంసం.. భారత్ ఘన విజయం

వెస్టిండీస్‌తో తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 295 పరుగులు చేయగా, ఈ లక్ష్యాన్ని భారత్ 41.4 ఓవర్లనే ఛేదించింది. కెప్టెన్ గిల్ (110) సెంచరీతో అదరగొట్టాడు. ఇక విరాట్ కోహ్లీ 88 బంతుల్లో 139* పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో కోహ్లీ 10 ఫోర్లు, 9 సిక్సర్లు బాదడం విశేషం. రోహిత్ 32 పరుగులు చేశాడు.