హైదరాబాద్: 28°C
క్రీడలు

జో రూట్ ఖాతాలో చెత్త రికార్డు

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో LBWగా వెనుదిరిగాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలా ఔటవడం అతడికి ఇది 12వ సారి. దీంతో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సార్లు ఎల్బీగా ఔటైన రెండో ఇంగ్లండ్ క్రికెటర్‌గా నిలిచాడు. పాల్ కాలింగ్ వుడ్ (14 సార్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.