హైదరాబాద్: 28°C
వార్తలు

శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం

కడప: శిల్పారామం సందర్శకులకు ‘శక్తి’ యాప్‌పై రిమ్స్ పీఎస్ సీఐ రాజగోపాల్ ఆదివారం అవగాహన కల్పించారు. ఆపద సమయంలో SOS, డయల్ 112 ద్వారా పోలీసు సహాయం పొందవచ్చని తెలిపారు. మహిళలు, బాలికలు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. సైబర్ మోసాలకు 1930, చైల్డ్‌లైన్ 1098, గృహహింసకు 181, మహిళా వేధింపులకు 1091ను సంప్రదించాలని సూచించారు.