హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదివారం బ్యాంకులు తెరిచి.. అరుదైన పరిణామం

SDPT: దేశవ్యాప్తంగా బ్యాంకింగ్‌ రంగంలో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. సాధారణంగా ఆదివారం బ్యాంకులకు పూర్తిస్థాయి సెలవు ఉంటుంది. అయితే వరుస సెలవుల నేపథ్యంలో ఆదివారం కూడా బ్యాంకులు తెరుచుకుని ఖాతాదారులకు సేవలు అందించాయి. జగదేవ్‌పూర్‌ మండల కేంద్రంలోని అన్ని బ్యాంకులు ఆదివారం పనిచేశాయి. వరుస సెలవుల కారణంగా ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా సిబ్బంది విధులు నిర్వహించారు.