హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరక్షరాస్యులకు పరీక్షలు

MDK: నాలుగు మున్సిపల్ పట్టణాలలో 2500 మంది నిరక్షరాస్యులను ఉల్లాస్ పథకం కింద గుర్తించినట్లు మెప్మా పీడీ హనుమంత రెడ్డి తెలిపారు. తూప్రాన్‌లో నిరక్షరాస్యులకు శిక్షణానంతరం పరీక్ష నిర్వహించారు. మొదటి విడతగా 1200 మంది నిరక్షరాస్యులకు శిక్షణ ఇచ్చి పరీక్ష నిర్వహించినట్లు వివరించారు. ఉత్తీర్ణత సాధించిన నిరక్షరాస్యులకు సర్టిఫికెట్ అందజేస్తామన్నారు.