HNK: జిల్లా కేంద్రంలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో AISF 90వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు AISF జాతీయ ప్రధాన కార్యదర్శి దినేశ్ తెలిపారు. ఆదివారం హన్మకొండ పట్టణంలోని కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రోజుల వేడుకలకు విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
VIDEO: 'ఈ 28 నుంచి AISF వార్షికోత్సవ వేడుకలు'


