ADB: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తానని ఆదిలాబాద్ MLA పాయల్ శంకర్ అన్నారు. సాత్నాల మండలంలోని పార్ది గ్రామానికి వంతెనతో పాటు బీటీ రోడ్డు మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేను గ్రామస్థులు ఇవాళ ఘనంగా సన్మానించి అభినందించారు. గ్రామాల అభివృద్ధిలో రోడ్ల నిర్మాణం కీలకమని, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల రహదారులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సహకరిస్తా: MLA


