హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

కృష్ణా:: జి.కొండూరు మండలం చెవుటూరు బైపాస్‌లో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. వేగంగా వచ్చిన కారు ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంకటాపురానికి చెందిన కిరణ్‌కుమార్‌గా గుర్తించారు. స్థానికులు 108 వాహనం ద్వారా విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు.