హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆహ్లాదకర వాతావరణమే బాధ్యత'

W.G: ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే మున్సిపాలిటీ బాధ్యత అని కమిషనర్ ఎం. ఏసు బాబు అన్నారు. స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం తాడేపల్లిగూడెం వాకర్స్ గ్రౌండ్లో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. గ్రౌండ్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారాలు వేయకుండా పరిశుభ్రత పాటించాలన్నారు. మున్సిపల్ ఏఈ హరీశ్, వాకర్స్ ప్రతినిధులు తిరుమళ్ల సూరిబాబు పాల్గొన్నారు.