KMM: కొణిజర్ల మండలం, లింగగూడెంకు చెందిన పలిమెల గోపాలరావు రోడ్డు ప్రమాద గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందారు. మూడు నెలల క్రితం తనికెళ్ల వద్ద జరిగిన ప్రమాదంలో ఆయన కాలితో పాటు నడుము భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి ఖమ్మంలో చికిత్స తీసుకుంటున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి


