PDPL బ్యాంకు ఉద్యోగుల మూడు రోజుల సమ్మెకు CITU సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గోదావరిఖనిలో ఆదివారం బ్యాంకుల వద్ద మద్దతు కరపత్రాలు విడుదల చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు నామని బిక్షపతి మాట్లాడుతూ.. 5 రోజుల పని విధానం అమలు చేయాలని, PLI పథకం అమలు, 12వ వేతన ఒప్పందంలోని డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని, యాజమాన్యాలను డిమాండ్ చేశారు.
తెలంగాణ
బ్యాంకు ఉద్యోగులకు CITU మద్దతు


