హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాపర్ వైర్ల చోరీ కేసులో నలుగురు అరెస్ట్

CTR: గుడుపల్లి మండలం పొగురుపల్లి పారిశ్రామిక ప్రాంతంలోని ఏబీఐఎస్ కంపెనీలో కాపర్ వైర్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కేసులో నలుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.15 లక్షల విలువైన 280 కిలోల కాపర్ వైర్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.