CTR: సచివాలయ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా నిరసన చేస్తుంటే అడ్డుకుని అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పుంగనూరులో ఇవాళ ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వ హయాంలో 1,26,000 మందిని సచివాలయ కార్యదర్శులుగా నియమించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వారికి ఇబ్బందులు కల్పిస్తోందని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
ఉద్యోగుల అరెస్టులపై పెద్దిరెడ్డి ఆగ్రహం


