హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధిత కుటుంబానికి మాజీ హోంమంత్రి భరోసా

E.G: గోపాలపురం మండలం వాదాలకుంటకి చెందిన మాజీ సర్పంచ్ గెడా జగ్గారావు ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ హోంమంత్రి, గోపాలపురం నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ తానేటి వనిత ఆదివారం వాదాలకుంటకు వెళ్లి జగ్గారావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా జగ్గారావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.