హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 30న కిసాన్ మేళా

MNCL: రైతులకు వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు బెల్లంపల్లిలో కృషి విజ్ఞాన కేంద్రంలో ఈనెల 30న కిసాన్ మేళా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతు సంక్షేమ కార్యక్రమాలపై కళారూపాల ద్వారా వివరించడం జరుగుతుందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.