NZB: సిరికొండ మండలం పెద్దవాల్గోట్ మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ సమస్య నెలలుగా కొనసాగుతోంది. మరమ్మతులు చేసినా మళ్లీ లీకవుతుండటంతో నీరు నిల్వ ఉండి దోమల బెడద పెరుగుతోందని గ్రామస్తులు తెలిపారు. లీకేజీ నీరు తాగునీటిలో కలిసే అవకాశం ఉండటంతో విషజ్వరాలు, డయేరియా వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరారు.
తెలంగాణ
మిషన్ భగీరథ నీటి లీకేజీతో ప్రజల్లో ఆందోళన


