హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

షార్ట్‌ సర్క్యూట్‌‌.. బాధితులకు అండ..!

కృష్ణా: పోలిశెట్టిపాడు గ్రామంలో కొమ్ము వెంకటేశ్వరరావు- కళ్యాణి దంపతుల ఇల్లు విద్యుత్ షార్ట్‌ సర్క్యూట్‌తో పూర్తిగా దగ్ధమైంది. దీంతో కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడింది. విషయం తెలుసుకున్న హ్యుమన్ రైట్స్ ఫౌండేషన్ స్టేట్ కన్వీనర్ కోట రాధా, సద్గురు సాయి దివ్యాంగుల ఆశ్రమం కరెస్పాండెంట్ వెంకటేశ్వర్లు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, నిత్యావసర సరుకులను అందజేసారు.