ASF: పెంచికల్‌పేట మండలం ఎల్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్ ఏర్పాటుకు MLA డా. పాల్వాయి హరీష్ బాబు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఆయన మొక్కలు నాటి, పచ్చదనం ప్రాధాన్యతను వివరించారు. ప్రజల ఆరోగ్యం, చిన్నారుల ఆటవిడుపు కోసమే ఈ సౌకర్యాలు తెస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ రాంచందర్, సెక్రటరీ విజయ్ కుమార్, బీజేపీ నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ
ఓపెన్ జిమ్ ఏర్పాటుకు శంకుస్థాపన


