హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs WI: హాఫ్ సెంచరీతో చెలరేగిన గిల్

296 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. వెస్టిండీస్‌కు ధీటుగా బదులిస్తోంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (57*) అర్ధశతకం పూర్తి చేసుకోగా, రోహిత్ శర్మ 32 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించి మంచి శుభారంభం అందించారు. రోహిత్ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ ప్రస్తుతం 25 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. 18 ఓవర్లలో IND స్కోర్: 115/1.