హైదరాబాద్: 28°C
క్రీడలు

హైజంప్‌లో భారత్‌కు తృటిలో స్వర్ణం మిస్

ఆసియా క్రీడల్లో పురుషుల హైజంప్‌లో భారత స్టార్ అథ్లెట్ సర్వేశ్ కుశ్రే రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అద్భుత ప్రదర్శనతో సర్వేశ్ 2.25 మీటర్ల ఎత్తును విజయవంతంగా దూకాడు. చైనీస్ తైపీకి చెందిన ఫు చావో-హ్సువాన్ కూడా సరిగ్గా ఇంతే ఎత్తు దూకాడు. అయితే, ప్రత్యర్థి తన మొదటి ప్రయత్నంలోనే ఈ మార్కును అందుకోగా, సర్వేశ్ మూడో ప్రయత్నంలో దాటడంతో రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.