హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భక్తుల కోసం స్మార్ట్ బస్టాండ్లు..!

TPT: తిరుమలలో భక్తుల సౌకర్యార్థం స్మార్ట్‌ బస్‌స్టాండ్లను ఏర్పాటు చేసేందుకు టీటీడీ చర్యలు చేపడుతోంది. కొండపై ఉన్న బస్టాప్‌లకు సంబంధించిన కీలక సమాచారాన్ని డిజిటల్‌ డిస్ప్లేల ద్వారా భక్తులకు అందించనుంది. బస్సుల రాకపోకలు, వేచి ఉండే సమయాల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేసేలా ఏర్పాట్లు చేయనున్నారు. GNSS ఆధారిత సాంకేతికతతో పర్యవేక్షించనున్నారు.