హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

ATP: గూటిబైలులోని తిమ్మమ్మ మర్రిమాను వద్ద ప్రపంచ పర్యాటక దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన 'ఎకో అండ్ హెరిటేజ్ వాక్', కీలుగుర్రాలు, గురవయ్యల నృత్యాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ధర్మవరానికి చెందిన బాబు బాలాజీ, మానస బృందం ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు, 'తిమ్మమాంబ సెల్ఫీ పాయింట్' ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.