ఆసియా క్రీడల్లో మహిళల 200 మీటర్ల రేసులో భారత అథ్లెట్ హరిత భద్ర కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ ఫైనల్ రేసును ఆమె 23.20 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. ఈ రేసులో పాల్గొన్న మరో భారత అథ్లెట్ ఉన్నతి 23.46 సెకన్లతో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. సింగపూర్ అథ్లెట్ శాంతి పెరీరా (22.78 సెకన్లు) స్వర్ణం గెలవగా, చైనాకు చెందిన చెన్ యుజీ (22.93 సెకన్లు) రజత పతకం సాధించింది.
క్రీడలు
మహిళల 200 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్యం


