హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయంలో హుండీ చోరీ

HNK: పరకాల ప్రాంతంలోని ప్రముఖ మల్లక్కపేట అభయాంజనేయ స్వామి ఆలయంలో శనివారం రాత్రి దొంగలు చొరబడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయానికి ప్రతిరోజూ వెళ్లే జగన్నాథ ఆచార్యులు ఆదివారం ఉదయం పూజల కోసం ఆలయానికి వెళ్లి చూడగా హుండీ కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మల్లక్కపేట అభయాంజనేయ స్వామి ఆలయం తెలంగాణలో రెండో కొండగట్టుగా ప్రాచుర్యం పొందింది.