హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు జడ్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్

SKLM: ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను వినియోగించుకోవాలని కోరారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100కు నేరుగా ఫోన్ చేసి, సమాచారం తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.