హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉద్యమకారులకు అండగా ఉంటాం'

HNK: తెలంగాణ కోసం వివిధ దశల్లో ఉద్యమాలు చేసిన నిజమైన ఉద్యమకారులను గుర్తించి, వారికి తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాళోజీ తెలంగాణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాజయ్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు గురుమూర్తి ఆధ్వర్యంలో ఉద్యమకారులు ఎమ్మెల్యేను కలిసి సన్మానించారు.