హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీసీపల్లి విద్యార్థులకు ప్రథమ స్థానం

ప్రకాశం: కనిగిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఆదివారం నిర్వహించిన మార్కాపురం జిల్లా స్థాయి చెకుముకి టాలెంట్‌ టెస్ట్‌లో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో పీసీపల్లి(M) నేరేడుపల్లి జడ్పీ హైస్కూల్‌ విద్యార్థులు ప్రథమ స్థానం సాధించారు. బీ.కీర్తి, జీ.మధుసూదన్‌, పి.హృషికేష్‌ విజేతలుగా నిలిచారు. కంభం, వెలిగండ్ల జడ్పీ హైస్కూళ్లు ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించాయి.