హైదరాబాద్: 28°C
తెలంగాణ

పటాన్చెరులో యువకుడు మిస్సింగ్

SRD: కిరాణా షాప్‌కు వెళ్లి వస్తానని ఇంటి నుంచి వెళ్లిన యువకుడు తిరిగి రాకపోవడంతో పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ముఖేష్ కుమార్ (20) మేస్త్రీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 26న కిరాణా షాప్‌కు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ముఖేష్ తిరిగి రాలేదు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.