హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాలుగు రోజులుగా వెలగని వీధి దీపాలు

SKLM: నరసన్నపేటలోని గాంధీనగర్ వీధిలో గత నాలుగు రోజులుగా వీధి దీపాలు పనిచేయడం లేదని స్థానికులు తెలిపారు. దీంతో రాత్రి వేళ వీధి మొత్తం చీకటిగా మారుతోంది. పిల్లలు, మహిళలు బయటకు రావాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించి వీధి దీపాలు పునరుద్ధరించాలని కోరుతున్నారు.