హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్

SS: జిల్లా వ్యాప్తంగా ఆదివారం అన్ని పోలీసు స్టేషన్లలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర గలవారికి అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, లేని పక్షంలో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకే ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.