హైదరాబాద్: 28°C
తెలంగాణ

హాఫ్ మారథాన్‌లో దుస్స కుమార్ ప్రతిభ

KNR: కరీంనగర్‌లో రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 21 కి.మీ. హాఫ్ మారథాన్‌ను గొల్లగూడెం ఉపసర్పంచ్ దుస్స కుమార్ 2 గంటల 20 నిమిషాల్లో పూర్తి చేశారు. సుమారు 1,500 మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో సిద్దిపేట సీసీఎస్ ఏసీపీ గడ్డం సదన్ కుమార్ చేతుల మీదుగా ఫినిషర్ మెడల్ అందుకున్నారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని కుమార్ సూచించారు.