హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పశువుల అక్రమ రవాణా.. వ్యక్తి అరెస్ట్

PPM: కురుపాం గ్రామ సమీపంలోని ఎలక్ట్రికల్‌ సబ్‌స్టేషన్‌ వద్ద పశువులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. వాహనంలో వధ నిమిత్తం తరలిస్తున్న 6 పశువులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పాలకొండ మండలం బడ్డుమాసింగికి చెందిన పొట్నూరు శంకరరావు (45)ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.