WG: భీమవరంలోని డీ.ఎన్.ఆర్. కళాశాలలో అంతర్జాతీయ సైన్ లాంగ్వేజ్ దినోత్సవం, బధిరుల వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ చదలవాడ నాగరాణి బధిరులకు స్మార్ట్ ఫోన్లు అందజేసి, కేక్ కట్ చేశారు. ఆమె మాట్లాడుతూ.. పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
వైకల్యం చదువుకు అడ్డంకి కాదు: కలెక్టర్


