హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'పెద్ద చెరువు ఆక్రమణలను అడ్డుకోవాలి'

అన్నమయ్య: పెద్ద చెరువు ఆక్రమణలను వెంటనే అడ్డుకుని చెరువును పరిరక్షించాలని సీపీఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి ఆక్రమణలను తొలగించడంతో పాటు, అక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.