హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరుపయోగంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని అంగడి బజార్ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఏళ్లుగా నిరుపయోగంగా మారాయి.పిచ్చి మొక్కలతో భవనాలు అధ్వానంగా కనిపిస్తున్నాయి. గత పదేళ్లుగా ఇళ్ల పంపిణీ కోసం ఎదురుచూస్తున్నా,ఎప్పుడు అందిస్తారో స్పష్టత లేకపోవడంతో స్థానికుల్లో అసంతృప్తి నెలకొంది. అర్హులైన వారికి ప్రభుత్వం ఇళ్లను కేటాయించాలని కోరుతున్నారు.