హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్షం లేక ఎండిన వరి.. ఆదుకోవాలని వేడుకోలు

NRPT: ఊట్కూరు మండలంలోని అవుసలోనిపల్లి గ్రామంలో వర్షం లేక, బోర్లలో నీళ్లు రాకపోవడంతో వరి పంట ఎండిపోయిందని రైతు పోలప్ప ఆవేదన వ్యక్తం చేశారు. భూగర్భజలాలు అడుగంటడంతో నాటిన వరికి నీరు అందక ఎండిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. పెట్టుబడి కూడా దక్కడం లేదని వాపోయారు. ప్రభుత్వం పంట నష్టాన్ని పరిశీలించి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు.