SDPT: బెజ్జంకి మండలం లక్ష్మీపూర్‌లో ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో వయోజన విద్యా పరీక్షలు నిర్వహించారు. వృద్ధులు, నిరక్షరాస్యులకు లెక్కలు, బొమ్మలు, వస్తువులను గుర్తించడం, ఖాళీలు పూరించడం వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చారు. సర్పంచ్ ముక్కిస కవిత పరీక్షలను పరిశీలించి, వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చదువు నేర్చుకోవాలని సూచించారు.
తెలంగాణ
లక్ష్మీపూర్‌లో వయోజన విద్య పరీక్షలు


