కోనసీమ: ఆలమూరు మండలం బడుగువానిలంకలో గోదావరి ఉధృత ప్రవాహానికి నదీ తీరంలోని పంట పొలాలు కోతకు గురవుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొంత వ్యవసాయ భూమి గోదావరిలో కలిసిపోయిందని, ఇదే పరిస్థితి కొనసాగితే మరిన్ని పొలాలు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు తెలిపారు. పంట భూముల రక్షణకు రాతి అడ్డుకట్టలు, రక్షణ గోడలు నిర్మించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కోతకు గురవుతున్న పంట పొలాలు


