హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

SRD: ​కల్హేర్ మండలం మీర్ఖాన్‌పేట్‌లో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అర్హులకు స్మార్ట్ రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ మార్పులు వస్తున్నందున ప్రజలు నీరు, విద్యుత్‌ను పొదుపు చేయాలని కోరారు. త్వరలోనే కొత్త సబ్‌స్టేషన్లతో లో-వోల్టేజ్ సమస్య తీరుస్తామన్నారు.