హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అధికారులు సమన్వయంతో పనిచేయాలి'

SKLM: ఆమదాలవలస మండలంలోని ముంపు ప్రభావిత గ్రామాల్లో ఆర్డీవో సాయి ప్రత్యూష ఆదివారం విస్తృతంగా పర్యటించారు. చీమలవలస, కలివరం, తొగరం, దూసి గ్రామాల్లో పర్యటించి వరద పరిస్థితులను పరిశీలించారు. రైతుల పంటలను కాపాడేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పంట పొలాల్లో నిల్వ ఉన్న నీటిని త్వరితగతిన బయటకు మళ్లించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.