హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడి పదవి తొలగింపు

కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బోయ క్రాంతి నాయుడిని పదవి నుంచి తొలగించినట్లు ఏపీ కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ఆదివారం ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణల నేపథ్యంలో చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. డీసీసీ వ్యవహారాల నిర్వహణకు ముగ్గురు సభ్యులతో తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసింది.