హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘ఓటు చోరీ’ ఆరోపణలను తిప్పికొట్టిన బీజేపీ

VSP: బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు ‘ఓటు చోరీ’ అని నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ​విశాఖ బీజేపీ కార్యాలయంలో మాట్లాడారు. పారదర్శకమైన ఓటర్ల జాబితా వ్యవస్థను తప్పుబట్టడం సరికాదన్నారు. ప్రజల్లో బలం ఉంటే క్షేత్రస్థాయిలో పోటీ చేసి గెలవాలని హితవు పలికారు.