JN: నర్మెట్ట మండల కేంద్రంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం..ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రెండు ద్విచక్ర వాహనాలు ఒకదానినొకటి ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గాదర రత్నం(54) తీవ్ర గాయలతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి


