హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కరెంట్ తీగలపై పొదల పంజా

AKP: బుచ్చయ్యపేట మండలం మంగలాపురం పంచాయతీ పరిధిలోని కుముందాముపేట గ్రామంలో విద్యుత్ స్తంభానికి, తీగలకు పిచ్చి పొదలు అల్లుకున్నాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో పాటు ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పొదలను తొలగించాలని కోరుతున్నారు.