హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది: ఎమ్మెల్యే

CTR: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతున్నట్లు పుంగనూరు MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పుంగనూరులో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీ నియామకాలలో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు కల్పించాలని ఆరోపించారు. పోలీసు వ్యవస్థ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నట్లు చెప్పారు. రాయలసీమలో తీవ్ర కరువు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.