హైదరాబాద్: 28°C
తెలంగాణ

మధ్యమానేరు జలాశయానికి గోదావరి జలాలు

PDPL: శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నుంచి మధ్యమానేరు జలాశయానికి గోదావరి జలాల తరలింపు కొనసాగుతోంది. ఆదివారం నంది మేడారం, లక్ష్మీపూర్ పంప్‌హౌస్‌లలో నాలుగు మోటర్లతో నీటిని తరలిస్తున్నారు. దీంతో 12,600 క్యూసెక్కుల నీరు వరద కాలువ ద్వారా మధ్యమానేరు జలాశయానికి చేరుతోంది. ఎల్లంపల్లికి వస్తున్న వరదకు అనుగుణంగా నీటిని తరలిస్తున్నట్లు ఈఈ రాంప్రదీప్ తెలిపారు.