JGL: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లా పర్యాటక, యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో ఇబ్రహీంపట్నం జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. 10వ తరగతి విద్యార్థిని మయూరి, 9వ తరగతి విద్యార్థి జయంత్ ప్రతిభకు జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ ప్రశంసా పత్రాలు, మెడల్స్ అందజేశారు. వారిని పలువురు అభినందించారు.
తెలంగాణ
పర్యాటక దినోత్సవ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ


